పల్లాకు మళ్ళీ పట్టం కట్టాలి

పట్టభద్రులతో ఎమ్మెల్యే బిజీబిజీ
పనితీరుతోనే మళ్ళీ పట్టాభిషేకం
టిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టాామల్లేష్ గౌడ్ 

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మళ్ళీ పట్టం కట్టేందుకు పట్ట బద్రులంత సంసిద్దులు కావాలని టిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. చావు నోట్లో తలదూర్చి తెలంగాణ సాధించడం ఒక్క ఎత్తైతే… బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు ప్రతిరూపంగా పనిచేస్తున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎంఎల్ సి అభ్యర్థి డా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, ఎన్ బిఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ నలమోతు సిద్దార్థ లు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. మిర్యాలగూడ నియోజక వర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాలు, మిర్యాలగూడ పట్టణ పరిధిలోని పట్ట భద్రులను కలిసి పల్లా కు ఓట్లు వేయించేందుకు విశిష్ట కృషి చేస్తున్నారన్నారు. గత ఆరేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ శాఖల్లో ఎంతోమందికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో 1,32,900 మందికి పంచాయతీ రాజ్, విద్యుత్, సింగరేణి, గురుకులాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్నారు. ఇక మంత్రి కేటిఆర్ చొరవతో ప్రైవేట్ సంస్థలు, కంపెనీల్లో సుమారు 16.5 లక్షల మంది కి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత టిఆర్ఎస్ సర్కారుకు ఉందన్నారు. అదే స్పూర్తి, ఒరవడితో మిర్యాలగూడను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కృషి చేస్తున్నారన్నారు. ఎడారిని తలపిస్తున్న భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు చొరవతో రూ.542 కోట్లతో 4 లిఫ్టులను మంజూరు చేయించగా అడవిదేవులపల్లి, వేములపల్లి మండలాల్లోని వీర్లపాలెం, తోపుచర్లల్లోనూ లిఫ్ట్ ల నిర్మాణాలకు హలీయా సభలో సీఎం కేసీఆర్ సుమారు మరో రూ.10 కోట్లను మంజూరు చేయించడం లో ఎమ్మెల్యే భాస్కర్ రావు విశిష్టమన్నారు. తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ సర్కారుపై బీజేపి అర్దరహిత విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 170 మెడికల్ కాలేజీలను ప్రకటించిన బీజేపి కేంద్ర సర్కారు తెలంగాణ కు మొండి చెయ్యి చూపిందన్నారు. జీఎస్టీ నిధుల విడుదల లోనూ అదే దోరణిని అవలంభిస్తుందన్నారు. ఐటిఐఆర్ మంజూరులోనూ తెలంగాణ పట్ల బీజేపి వివక్షత ప్రదర్శిస్తుoదన్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెట్రో, గ్యాస్ ధరలను పెంచి బీజేపి సామాన్యులపై పెను భారం మోపుతుందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో అంకిత భావంతో పనిచేస్తూనే అనురాగ్ యూనివర్సిటిలో సుమారు 4 వేల మందికి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉద్యోగాలు కల్పించరాన్నారు. సౌమ్యుడు, స్నేహశీలి, సీఎం కేసీఆర్ కు అనుంగు అనుచరుడుగా ఉన్న డా పల్లా రాజేశ్వర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కట్టా మల్లేష్ గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మజ్జిగపు సుధాకర్ రెడ్డి, మాజీ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కాట్రగడ్డ రాజగోపాల్ రావ్, చిరుమర్రి నాగయ్య, కట్టా మట్టమ్మ, వెంకటయ్య, నక్క నాగరాజు, కంచర్ల జనార్దన్ రెడ్డి, ఎం. వెంకట్ రెడ్డి, రాము, బొమ్మకంటి సైదులు, బొడ్డు జానకమ్మ, శిరస్సు సైదులు, కోదాటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *