పల్లాకు గుత్తా శుభాకాంక్షలు

నల్గొండ, అక్షిత ప్రతినిధి : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని నల్లగొండలోని నివాసంలో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి పుష్ప గుచ్చం అందజేసీ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తెర చిన్నపరెడ్డి , మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొని డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *