‘పరదేశి’ సినిమాలో హీరో ఛాన్స్ కోసం ట్రై చేశాను: కౌశల్

‘పరదేశి’ సినిమాకి సెలెక్ట్ కాలేదు
‘రాజకుమారుడు’లో నటించాను
అమ్మ చెప్పిన మాటలనే అనుసరిస్తున్నాను
తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో కౌశల్ మాట్లాడుతూ, నటుడిగా తన సినీరంగ ప్రవేశం గురించి ప్రస్తావించాడు. “మొదటి నుంచి కూడా నేను మోడలింగ్ పై దృష్టిపెడుతూ వచ్చాను. అలా మోడలింగ్ వైపు అడుగులు వేస్తోన్న సమయంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు .. నిర్మాత అల్లు అరవింద్ గారు ‘పరదేశి’ సినిమాకి అవసరమైన హీరో హీరోయిన్ల కోసం ఒక రియాలిటీ షో పెట్టారు. అప్పుడు లక్ష అప్లికేషన్స్ వస్తే పది మంది అబ్బాయిలను .. పది మంది అమ్మాయిలను సెలెక్ట్ చేశారు.

ఆ పది మంది అబ్బాయిల్లో నేను ఒకడిని. నాతో పాటు శివాజీ .. లయ .. ప్రత్యూష కూడా వున్నారు. ఆ సినిమాలో హీరోగా నేను సెలెక్ట్ కాకపోయినా, ఆ తరువాత ‘రాజకుమారుడు’ సినిమాలో మహేశ్ బాబు ఫ్రెండ్ గా నటించాను. అలా నటుడిగా నా కెరియర్ మొదలైంది అని చెప్పుకొచ్చాడు. మా అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం .. జీవితమంటే పుట్టడం .. ఎంజాయ్ చేయడం .. చనిపోవడం కాదు, జీవితమంటే సాధించడం అని చెబుతూ ఉండేది. చనిపోయిన తరువాత మన గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలని చెబుతుండేది .. ఆ మాటలనే నేను అనుసరిస్తూ వస్తున్నాను” అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *