పంచాయితీల ప్రగతికి ప్రణాళిక : కలెక్టర్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :  గ్రామ పంచాయతీ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ట్రాన్స్ కో ఇంజినీరింగ్ అధికారులు విద్యుత్ సంబంధిత పనులు గ్రామంలో సక్రమం గా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు.మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ట్రాన్స్ కో డి.ఈ.లు, ఏ.ఈ ల తో సమావేశం నిర్వహించి 30 రోజుల గ్రామ పంచాయతి ప్రత్యెక ప్రణాళిక కార్యక్రమంలో ట్రాన్స్ కో అధికారుల తో సమీక్షి స్తూ పలు సూచనలు చేశారు.ట్రాన్స్ కో ఏ.ఈ.లు తప్పనిసరిగా పాల్గొనాలని,అన్ని గ్రామాల్లో పనులు చేపట్టాలని అన్నారు.విద్యుత్ స్తంభాలు శిధిలమైన వాటి స్థానంలో,తుప్పు పట్టిన వాటి స్థానంలో కొత్త స్తంభాలు వేయడం,థర్డ్ వైర్ లాగడం,వీధి దీపాలు, మీటర్లు బిగించడం పనులు చేపట్టి రికార్డ్స్ నిర్వహించాలని,వచ్చిన మెటీరియల్ దుర్వినియోగం చేయకుండా వినియోగించాలని అన్నారు.గ్రామంలో చేపట్టిన పనులు మండల పర్యవేక్షణ అధికారులకు వివరించాలని సూచించారు.ముఖ్య మంత్రి స్వయంగా గ్రామాల అభివృద్ధికి సంకల్పించి గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రత్యెక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం రూపొందించారని,ట్రాన్స్ కో అధికారులు గ్రామంలో గుర్తించిన సమస్యలు పరిష్కరించి మార్పు కనిపించేలా పనులు చేపట్టాలని అన్నారు.తాను స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు ఈ సందర్బంగా ట్రాన్స్ కో అధికారులు చేపట్టిన పనులు సమీక్షించ నున్నట్లు తెలిపారు.రాష్ట్రం నుండి సీనియర్ అధికారుల బృందాలు జిల్లాల్లో పర్యటించి పనులు పరిశీలించి ముఖ్యమంత్రి కార్యాలయంకు నివేదించనున్నట్లు తెలిపారు.ట్రాన్స్ కో అధికారులు 30 రోజుల కార్యక్రమంలో పనులు చేపట్టి మార్పు కనిపించేలా చర్యలు తీసుకోవాలని,విద్యుత్ షార్ట్ సర్క్యూట్,ప్రమాదాలు జరగకుండా,ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ లు ఉంటే ఫెన్సింగ్ రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ సమావేశంలో ట్రాన్స్ కో ఎస్.ఈ.కృష్ణయ్య, డి.ఈ. రామా రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

tags : collector, grampanchayatis, 30 Days Dev planing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *