నేరుగా నేరాలను పసిగట్టొచ్చు : మంత్రి జగదీష్ రెడ్డి

అక్షిత బ్యూరో, సూర్యాపేట  : సైబర్ నేరాలను పసిగట్టేందుకు ఉపయోగపడే జిల్లా సైబర్ ల్యాబ్ మరి ఐటీ ల్యాబ్ కమ్యూనికేషన్ సెల్ విభాగాన్ని మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా పోలీసు కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక విభాగం వల్ల సిసిటీఎన్ ఎస్, కాల్ రికార్డింగ్ అనాలసిస్, ఆడియో మరియు వీడియో అనాలసిస్, కమ్యూనికేషన్స్, రేడియో మెస్సేజింగ్ విభాగాలు పనిచేస్తున్నాయని అన్నారు. వీటిని ఉపయోగించి సైబర్ నేరాలను అరికట్టవచ్చని అన్నారు.పని విభాగాలకు విడివిడిగా భవానాలు ఉంటె సిబ్బంది బాగా పని చేస్తారని తద్వారా సమాచార సేకరణ వేగవంతం అవుతుందనే ఉద్దేశ్యంతో నే ఈ నిర్మాణాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు.

 

tags : jagadeeshreddy, minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *