‘నేను కూడా కేసీఆర్‌లాగే పార్టీ అధ్యక్షుడినవుతా..’

అక్షిత ప్రతినిధి, మహబూబ్ నగర్ : మాజీ ఎంపీ, బీజేపీ ముఖ్యనేత జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బీజేపీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సేమ్ టూ సేమ్ పదవి..!

‘సీఎం కేసీఆర్ నాకు టికెట్ ఇవ్వకుంటే బీజేపీలో చేరి ఇప్పుడు ఆయన స్థాయి పదవిని పొందేందుకు రెడీగా ఉన్నాను. అదృష్టం ఉంటే నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని అవుతాను. కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు.. నేను బీజేపీ అధ్యక్షుడు. సేమ్ టూ సేమ్ పదవి. అందుకే టికెట్ రాని నేతలు ఎవ్వరూ బాదపడకూడదు. పార్టీ మున్ముందు అందరి గురించి ఆలోచిస్తుంది. పాలమూరులో ఇపుడు జరుగుతున్న రైల్వే లైన్, జాతీయ రహదారి విస్తరణ, సీసీఐ సెంటర్, పాస్ పోర్ట్ కౌంటర్ అన్నీ నేను సాధించినవే’ అని జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే జితేందర్ చేసిన వ్యాఖ్యలు ఇటు టీఆర్ఎస్‌లో.. అటు బీజేపీలో హాట్ టాపిక్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *