నిరుపేద ముస్లిం మహిళలకు రంజాన్ కిట్ల ఆసరా

ముస్లిం మహిళలకు ‘చిన్ని’ సహకారం

రంజాన్ కిట్ల పంపిణి అభినందనీయం

హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ప్రఖ్యాత పారిశ్రామికవేత్త చిన్ని శ్రీనివాస్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సామాజిక బాధ్యతగా పలు నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి సాయమందించారు. గతంలో ఆయన నిర్వర్తించిన పలు సేవా కార్యక్రమాలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించాయి. చిన్ని శ్రీనివాస్ సేవలను పలువురు ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. తాజాగా, మిర్యాలగూడ పట్టణానికి చెందిన పలువురు ముస్లిం మహిళలకు ఆయన రంజాన్ కిట్స్ పంపిణీ చేశారు. చిన్ని శ్రీనివాస్ సహకారంతో అందిన రంజాన్ కిట్స్ ను ముస్లిం మహిళలకు సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హామీద్ షేక్ ఆదివారం అందజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద ముస్లింలకు సాయం అందించేందుకు ముందుకొచ్చిన చిన్ని శ్రీనివాస్ ను అభినందించారు. దాతలు అందిస్తున్న సహకారం పలు ముస్లిం కుటుంబాలను ఆదుకునేందుకు ఉపయుక్తమవుతున్నదని అన్నారు. ముస్లిం సోదరసోదరీమణులంతా రంజాన్ ఉపవాసదీక్షలను భక్తి,శ్రద్ధలతో చేపట్టాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం అల్లాను ప్రార్ధించాలని విజ్ఞప్తి చేశారు . రాష్ట్రంలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లిన సమయంలో కచ్చితంగా ముఖానికి మాస్కు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి లక్షలాది కుటుంబాలు కొలుకోలేదని అన్నారు. నిరుపేద ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో శక్తివంచన లేకుండా సాయం అందించేందుకు దాతలు, స్వచ్చంధ సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జానీపాషా, శంకర్, నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *