నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

ప్రభుత్వ జనరల్ దవాఖానలో త్వరలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇదివరకే ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లాలోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను కూడా నెలకొల్పాలని నిర్ణయించాం. త్వరలోనే హై టెక్నాలజీతో కూడిన, నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. శనివారం ప్రభుత్వ జనరల్ దవాఖానను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా మంత్రి శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా రోగుల సహాయకులు, పారిశుధ్య కార్మికులకు మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేశారు. అనంతరం జనరల్ హాస్పిటల్ కి వచ్చే రోగుల సహాయకులు కూర్చునేందుకు వీలుగా నిర్మించనున్న షెడ్డును పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించే విభాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా వార్డు ముందు ఉన్న కరోనా రోగులతో కూడా మంత్రి మాట్లాడి వారికి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణ , డాక్టర్ జీవన్, టీఎస్ఎంఐడీడీసీ ఈఈ శరత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *