అక్షిత ప్రతినిధి, హాలియా : వల్లభ రావు చెరువు ,14 వ మైలు కెనాల్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన జాయింట్ కలెక్టర్
వల్లభ రావు చెరువు, అణుముల మండలం14 వ మైల్ కెనాల్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదివారం గణేష్ ఉత్సవ కమిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. ఐ.బి.అధికారులు,పోలీస్,రెవెన్యూ,ట్రాన్స్ కో అధికారులు,అగ్నిమాపక,అర్&బి,మత్స్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించి నిమజ్జనం కు కావలిసిన ఏర్పాట్లపై సూచన లు చేశారు.చెరువు వద్ద ట్రాన్స్ కో లైటింగ్,అర్&బి బారికే డింగ్,క్రేన్ లు, ఐ.బి.శాఖ లోతు ఎక్కువ ఉన్న నీటి ప్రాంతంలో ప్రమాద సూచిక బోర్డులు, మత్స్య శాఖగజ ఈతగాళ్ళు,అగ్నిమాపక శాఖ విపత్తు నిర్వహణ కు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ తో అర్.డి. ఓ.నల్గొండ జగదీశ్వర్ రెడ్డి,మిర్యాల గూడ అర్.డి. ఓ. జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.
tags : nlg jc, chendrashekar, ganesh, haliya