నిధులివ్వండి

-ప్రధాని మోదీకి 22 అంశాలపై సీఎం కేసీఆర్ విజ్ఞప్తి

-ప్రధానితో 50 నిమిషాలపాటు చర్చ 

-రెండోసారి ప్రధాని అయిన తర్వాత తొలిభేటీ

-మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు 24వేల కోట్లివ్వాలి 

-జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలి

-పూర్తిగా కేంద్రం ఖర్చులతో గిరిజన వర్సిటీ 

-వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు 450 కోట్లు ఇవ్వాలి

-పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు విడుదలచేయాలి

-హైకోర్టు జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి

-ప్రధానికి విజ్ఞప్తిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్:

ప్రధానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన విజ్ఞప్తులు ఇవే..

1. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఏటా రూ.450 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. గత ఐదేండ్లలో నాలుగుసార్లు విడుదలైనా.. ఒక ఏడాది నిధులు ఇంకా విడుదలకాలేదు. వాటిని వెంటనే విడుదలచేయాలి.

2. నేషనల్‌హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి.

3. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి.

4. తెలంగాణలో ఐఐఎం నెలకొల్పాలి.

5. రాష్ర్టానికి ఐఐఎస్‌ఈఆర్ మంజూరుచేయాలి.

6. హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను ఏర్పాటుచేయాలి.

7. తెలంగాణలో మరో 23 నవోదయ స్కూళ్లు నెలకొల్పాలి.

8. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులు విడుదలచేయాలి.

9. నీతిఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయ పథకానికి రూ.5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదలచేయాలి.

10. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నెలకొల్పాలి.

11. జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులివ్వాలి.

12. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం మేరకు రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.

13. పీపీపీ పద్ధతిలో కరీంనగర్‌లో ఐఐఐటీ నెలకొల్పాలి.

14. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12%తో కలిపి మొత్తం బీసీలకు 37%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలి.

15. పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ తీర్మానంచేసింది.

16. హైదరాబాద్- నాగపూర్, వరంగల్- హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధిపరచాలి.

17. వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి పీఎంజీఎస్‌వై ద్వారా రూ.4వేల కోట్లు కేటాయించాలి.

18. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా, వందశాతం ఖర్చు కేంద్రమే భరించాలి.

19. సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తిగా కేంద్రం ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి.

20. వరంగల్ టెక్స్‌టైల్ పార్కు కోసం వెయ్యికోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అందించాలి.

21. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించాలి.

22. వరద కాల్వకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదలచేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *