నాణ్యమైన వైద్య సేవలందించాలి

ఎన్ బిఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ నల్లమోతు సిద్దార్ధ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్ధ కోరారు. పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మీ కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను, అత్యాధునిక కంటి పరీక్షల యంత్రాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రభు చైతన్య, వికాస్ కుమార్, రావులపెంట ఎంపీటీసీ శ్రీరాంరెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, మధు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *