నల్లబ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికుల నిరసన

అక్షిత ప్రతినిధి, పరిగి: సకలజనుల సమరభేరి సందర్భంగా కార్మికులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు పరిగిలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యత్నిస్తే పోలీసులు అడ్డుకుని అకారణంగా దాడులకు పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించే వరకూ నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు జంగయ్య, ప్రసాద్‌, విశ్వనాథం, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *