నర్సులంతా…మానవతావాదులు : మంత్రి ఈటెల

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : నర్సులంతా… రోగులకు విశిష్ట సేవలందించే మానవతావాదులని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్  అన్నారు. నర్సింగ్ వృత్తి…విశిష్టమైందన్నారు. శుక్రవారం కోరీలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నర్చెస్ డేను పురస్కరించుకుని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ అధ్యక్షతన జరిగిన నర్సు,  మిడ్ వైఫ్  2020 క్యాండిల్ లైట్ మార్చ్కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020ను నర్సెస్ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. 52 సంఘాలతో సమ్మిళితమైన జేఏసీ ఆధ్వర్యంలో నర్సెస్ డేకు తనను ఆహ్వానించి… లైటింగ్ ల్యాంప్ చేపట్టడం అభినందనీయమన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న అన్ని సమస్యలు పూర్తి అవగాహన ఉందని.. ఖాళీగా న్న పోస్టులను దశలవారీగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం ఉందన్నారు. తాను వైద్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తయిందని… అన్ని అంశాలపై హ అవగాహన కల్గిఉన్నామన్నారు. ఆయా అంశాలను పరిష్కరించేందుకు తగిన మూలాలను అన్వేషిస్తామన్నారు. తన శాఖలో చిన్న ఉద్యోగులను చులకనగా చూసే వద్దతిని మానుకోవాలని అధికారులను వెచ్చరించారు. కాంట్రాక్ట్ ఔెట్ సోర్సింగ్ కార్మికులకు ఈపీఎస్, ఇఎస్ వర్తింపచేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వాలని మంత్రి సూచించారు. ఆసుపత్రి లో వైద్యులు కన్నా నర్సింగ్, శానిటేషన్ స్టాఫ్ ఉద్యోగులు అతి ముఖ్యులన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వడకలకు రెట్టింపు సంఖ్యలో రోగులు వస్తే సిబ్బంది పై పనిభారం అధికమవుతుందన్నారు. పనిభారం తగ్గించేందుకు తగిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. వైద్యశాలలో రేషనలైజేషన్‌పై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు… అంతగా వన్ లేనటువంటి లెప్రసీ, టిబి శాఖలాంటివి గుర్తించి…వత్తిడి ఉన్న సెక్షన్లలో మారుస్తామన్నారు. వైద్యశాఖలో పనిచేస్తున్న ఆయా ఉద్యోగులు,  సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఐరిగెల రమేష్ (బొoగు), సెక్రటరీ జనరల్ బి.వెంకటేశ్వరరెడ్డి, కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. నరహరి, జూపల్లి రాజేందర్, మహిళా విభాగం నేత హేమలత, వనితవత్సల, ఆర్.దేవిక, కో-చైర్మన్లు షబ్బీర్ అహ్మద్, ఎస్ కె ప్రసన్న, మహ్మద్ కలిముద్దీన్, కో-కన్వీనర్లు ఎంఎస్ మూర్తి, వేణుగోపాల్ గౌడ్ సుజాత, రామలక్ష్మితో పాటు 52 సంఘాలల ప్రతినిధులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే..రేషనలైజేషన్ కి ముందే ఖాళీగా ఉన్న 3600 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వైద్య సిబ్బందిపై గుదిబండగా పరిణమించనున్న రేషనలైజేషన్ చేపట్టదని…అటెండర్ నుంచి డైరెక్టర్ వరకు ఖాళీగా ఉన్నపోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్, వైద్య విధానపరిషత్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్, అన్ని వైద్య కళాశాలల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్ డి పి సి నియామకాలు చేపట్టాలని తదితర పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు వినతిపత్రం సమర్పించారు.

కరోనా వైరస్ పై పుకార్లు నమ్మొద్దు: రాజేందర్

కరోనా వైరస్ ప్రభావం…తెలంగాణలో లేదని..పుకార్లు నమ్మొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
శుక్రవారం కోరీ వైద్య కళాశాల లో మీడియాతో మాట్లాడుతూ చైనా నుంచి భారత్ కు వచ్చిన 12 మందికి కరోనా వైరస్
నిర్ధారణ పరీక్ష చేయించమని…అందులో 9 మందికి వైరస్ లేదని నిర్ధారణ అయిందన్నారు. కరోనా వైరస్ పై సోషల్
మీడియా, మీడియాల్లో వుకార్లు సృష్టిస్తున్నారన్నారు. కరోనా వైరస్ పరీక్షల నిమిత్తం వివిధ ఆసుపత్రిలో ఐసోలేషన్
వార్డులను సిద్ధంగా ఉంచామన్నారు. ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్స్, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు.

 

 

 

 

tags : Etela, tjc, omc, telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *