దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత లేదు

న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి : దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏమాత్రం లేదని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలు కోరిన సంఖ్యలో తాము కరోనా వ్యాక్సిన్లను పంపిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. వారి వారి అవసరాల తగ్గట్టుగానే పంపిస్తున్నామని, ఏ రాష్ట్రానికీ వ్యాక్సిన్ కొరత రానివ్వమని తెలిపారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ స్పష్టం చేశామని, రాష్ట్రాలకు వ్యాక్సిన్ కొరత తలెత్తకుండా చూసుకుంటామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారు.

మా రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత : మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత నెలకొందని ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్ తోపే ప్రకటించడంతో ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని తాము కేంద్రానికి కూడా తెలిపామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉంది. కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి. ‘‘రాష్ట్రంలో వ్యాక్సిన్లు మరో మూడు రోజులకు మాత్రమే సరిపోతాయి. మరిన్ని డోసులు పంపించాలని కేంద్రాన్ని కోరాం. రాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.’’ అని రాజేశ్ తోపే వ్యాఖ్యానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *