దీపికా, ర‌ణ్‌వీర్‌ల పెళ్ళి విష‌యంపై ప్ర‌ధాని కామెంట్

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ ర‌ణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకుణేల వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే . ఇట‌లీలోని లేక్ కోమోలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, 200 మంది అతిధుల‌ని మాత్ర‌మే పెళ్లికి ఆహ్వానించ‌నున్నార‌ని అంటున్నారు. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, పార్టీ, డిసెంబర్ 11న ముంబైలోని గ్రాండ్ హయత్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం. అయితే ఇట‌లీనే ప‌లువురు ప్ర‌ముఖులు పెళ్లి వేదిక చేసుకోవ‌డంపై ఇట‌లీ ప్ర‌ధాని తాజాగా స్పందించారు. పెళ్లి వేడుక‌ల‌కి ఇట‌లీ అద్భుత‌మైన ప్ర‌దేశం. మా సంస్కృతి, ఆతిధ్యం, ప్ర‌కృతి అందాలు ప్ర‌పంచ దేశాల‌ని ఆక‌ర్షిస్తుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ఇక్క‌డ పెళ్ళి చేసుకోవ‌డానికి కార‌ణం కూడా ఇవే చెబుతారు. జీవితంలో ప్ర‌త్యేక‌మైన రోజుకు స్వ‌ర్గం లాంటి ప్ర‌దేశాన్ని వేదిక చేసుకోవాల‌ని ఎవ‌రు మాత్రం అనుకోరు అంటూ ఇట‌లీ ప్ర‌ధాని జుసెపి కోంటే అన్నారు. 18వ శ‌తాబ్దానికి చెందిన దేల్ బాల్బియానెల్లో విల్లాను దీపిక‌, ర‌ణ్‌వీర్ జంట‌ త‌మ పెళ్లి కోసం బుక్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో కోహ్లీ, విరాట్ జంట కూడా ఇదే ప్ర‌దేశంలో వివాహం చేసుకున్నారు. ప్రియాంక కూడా ఇక్క‌డే వివాహం చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.
Tags: Giuseppe Conte ,Italy ,Ranveer Singh , Deepika Padukone ,Bollywood , Ranveer Deepika Marriage , Destination Wedding , Wedding Plan ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *