దాతృత్వం చాటుకున్న రంగా శ్రీధర్

‘రంగా శ్రీధర్’ ఔదార్యం

ఇండోర్ స్టేడియం వాచ్మెన్ కు 50 కిలోల బియ్యం అందజేత

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, సామాజిక సేవా కార్యకర్త రంగా శ్రీధర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాజాగా, మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లోని ఇండోర్ స్టేడియంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న రాములు కుటుంబానికి బాసటగా నిలిచారు. ఇండోర్ స్టేడియంలో అనునిత్యం అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలందిస్తున్న రాములు కుటుంబానికి తన వంతుగా 50కిలోల సూపర్ ఫైన్ క్వాలిటీ బియాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. యువత సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కాగా, మిర్యాలగూడ నియోజకవర్గంలో అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న రంగా శ్రీధర్ తన సేవా దృక్పథంతో వందలాది కుటుంబాల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆస్పతుల్లో చికిత్స పొందుతున్న రోగులకు, ఫీజులు చెల్లించుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్న సరస్వతీ పుత్రులకు, ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులకు, ప్రయివేట్ టీచర్లకు, శ్రామికులను, ఆర్ధిక ఇబ్బందులతో పూటగడవని అభాగ్యులకు సాయం అందించి అక్కున చేర్చుకుంటున్నారు. కుల,మత,లింగ,వర్ణ బేధం లేకుండా ఆయన నిర్వర్తిస్తున్న సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యా సంస్థల కరస్పాండెంట్ రామకృష్ణా రెడ్డి, అనుదీప్, ఇండోర్ స్టేడియం షటిల్, బ్యాడ్మింటన్ కోచ్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *