దాతృత్వం చాటిన సంస్థలు

స్వచ్చంధ సంస్థల సేవలు అభినందనీయo
 సేవాతత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా విద్య ఫౌండేషన్ :కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, అక్షిత ప్రతినిధి :

కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో స్వచ్చంధ సంస్థల సేవలు అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యాయాన్ ఇనీషియేటీవ్, గోపి టెన్ ఫ్రాన్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఇచ్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ , మాస్కులు, శానిటైజర్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజని, సిబ్బంది కి అందజేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి మద్దతు పలకడం శుభ పరిణామం అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని , ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొవిడ్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలలో ఉండటం వల్ల వ్యాధి ఎక్కువ మందికి విస్తరించకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మత్తు వైద్యులు డాక్టర్ కొత్తపల్లి సురేష్ , విద్యా సంస్థ అధ్యక్షులు దేవరశెట్టి సాయి కృష్ణ , తిపిరి శెట్టి రాజు, పైడిమర్రి నారాయణ, కార్యవర్గ సభ్యులు దేవరశెట్టి బ్రహ్మం, సాయి రోషన్, వంగవీటి శేఖర్, దేవరశెట్టి చిన్న బ్రహ్మం, కృష్ణమూర్తి ,డాక్టర్లు సూరజ్, అశోక్, యాతాకుల మధుబాబు, హెడ్ నర్స్ మంగమ్మ , గీత ,పద్మ ప్రియ, భవాని, విజయ , గీతాభవాని తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *