దాతృత్వం చాటిన డా. మునీర్

సామాజిక సేవా శిఖరం ‘డాక్టర్ మునీర్’ 

12 మంది ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లు పంపిణి 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు, సామాజికవేత్త డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రతీ ఏడాది వేసవికాలంలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతూ పండుగల సమయంలో ప్రజలకు మజ్జిగ పాకెట్లను, పులిహోర పొట్లాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ విస్తృత సేవా కార్యక్రమాల ద్వారా ఆపన్నులను ఆదుకొని నియోజకవర్గ ప్రజల మన్ననలు, జిల్లా అధికారుల ప్రశంసలను అందుకున్నారు. సేవా కార్యక్రమాల్లో తనకంటూ ప్రత్యేక పంథాను ఎంచుకొని అనేక మందికి మార్గదర్శి నిలిచారు. తాజాగా, మిర్యాలగూడ పట్టణానికి చెందిన 12మంది ముస్లిం మహిళలకు ఒక్కొక్కరికి రూ.499 విలువైన ఒయాసిస్ ఫుడ్స్ రంజాన్ కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముస్లిం సోదరసోదరీమణులంతా రంజాన్ ఉపవాసదీక్షలను భక్తి,శ్రద్ధలతో చేపట్టాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం అల్లాను ప్రార్ధించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది రంజాన్ నాటికి భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందాలని, ప్రజలంతా కోవిడ్ కొరల నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లిన సమయంలో కచ్చితంగా ముఖానికి మాస్కు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి లక్షలాది కుటుంబాలు కొలుకోలేదని అన్నారు. నిరుపేద ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో శక్తివంచన లేకుండా సాయం అందించేందుకు దాతలు, స్వచ్చంధ సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్, అజీజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *