దళితులకు ఎస్ సి ఎస్టీ కమీషన్ భరోసా

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ దేశానికే దిక్సూచి : మ‌ంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

జ‌గిత్యాల, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ దేశానికే దిక్సూచి అని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. శ‌నివారం జ‌గిత్యాల జిల్లా వెల్గ‌టూర్ మండ‌లం అంబారిపేట గ్రామంలో పౌర‌హ‌క్కుల దినోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అంబారిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన‌ కుట్టు మిష‌న్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంత‌రం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎస్సీ మహిళల ఆర్థిక అభ్యున్నతికి టెయిలరింగ్ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఎస్సీ సామాజికవర్గ జనాబా కలిగిన గ్రామాలను గుర్తించి వారికి ఆర్థిక బరోసా కల్పించాలన్న ఉద్ధేశ్యంతో మాల, మాదిగ, నేతకాని కులస్థులు ఎక్కువగా ఉన్న గ్రామాలైన‌ అంబరిపేట, కిషన్‌రావు పేట, కొత్తపేట గ్రామాలను మొదట గుర్తించడం జరిగిందన్నారు.

సాదారణంగా ఒకటి రెండు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణను ఇచ్చి అనంతరం సర్టిఫికెట్‌తో పాటు కుట్టు మిషన్‌ను మహిళల‌కు అందించడం జరిగేదని కానీ ప్ర‌స్తుతం శిక్షణ కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మొదటి రోజునే కుట్టు మిషన్‌ల‌ను అందించి శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. మనం చేతిలో ఉన్న వృతిని నమ్ముకోవడం వల్ల ఎక్కడికి వెళ్లినా బ్రతకగలమనే స్థైర్యాన్ని పొందుతామ‌న్నారు. ఎంపిక చేసిన 40 మంది శిక్షణను విజయంతం చేసి మరికొంతమందికి స్పూర్తిగా నిల‌వాల‌న్నారు. అంతే కాకుండా జూట్ బ్యాగుల టెయిలరింగ్‌తో పాటు ఇత‌ర శిక్షణలను ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ చైర్ పర్సన్ దావ వసంత, పీడీ డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *