దర్శకుడితో ప్రేమ.. తొలిసారి మాట్లాడిన నయనతార

అగ్ర కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ తో  ప్రేమలో ఉన్నారని‌ గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే వీరు తమ ప్రేమ గురించి ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. కానీ విఘ్నేశ్‌ మాత్రం సోషల్‌మీడియా వేదికగా నయన్‌ గురించి ప్రత్యేక సందర్భాల్లో ప్రస్తావిస్తూనే వచ్చారు. ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో 2018లో వీరి పెళ్లి జరగనున్నట్లు వదంతులు వచ్చాయి. ఇద్దరు కలిసి ఓ ఇల్లు కొన్నారని కూడా చెప్పుకొచ్చారు. కాగా తన ప్రేమ గురించి నయన్‌ తొలిసారి ఓ వేదికపై మాట్లాడారు. విఘ్నేశ్‌ తనకు కాబోయే భర్తని చెప్పకనే చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *