థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం: సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి: కరోనా మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది. తాజాగా బన్సీలాల్‌పేట్‌లో మొబైల్‌ మెడికల్‌ వ్యాన్‌ను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వృద్ధులు, దివ్యాంగులకు స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టినట్టు సీఎస్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 మొబైల్‌ మెడికల్‌ వ్యాన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోందన్నారు.

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మొబైల్‌ యూనిట్‌లో డాక్టర్‌, ఫార్మాసిస్ట్‌, ఏఎన్‌ఎం ఉంటారని తెలిపారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం, మానవ వనరుల బలోపేతం, సామర్థ్యం పెంపొందించడం, వైరస్‌ వ్యాప్తి చేసే గ్రూపులకు టీకాలు వేయడం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని సీఎస్‌ పేర్కొన్నారు. ఎక్కువ మందిని కలుస్తూ సూపర్‌ స్ప్రెడర్లుగా మారడానికి అవకాశం ఉన్నవారికి ప్రభుత్వం ముందుగా టీకా వేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *