చక్ర “బంధం”లో పుట్ట !

మంతనాల ‘పుట్ట’!!

మంథని, అక్షిత ప్రతినిధి : మంథని మధు మంతనాలు పర్వం సాగుతుంది. న్యాయ వాద దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్పటికి… తనకేమీ సంబంధం లేదని బహిరంగంగా ప్రకటిస్తూనే గులాబీ సభ్యత్వాల్లో పుట్ట మునిగి తేలుతుండ్రు. పైకి గంబీరతను ప్రదర్శిస్తున్నప్పటికి హత్యల కేసులో అరెస్ట్ అయిన మేనల్లుడి వ్యవహారం తదితర నేపథ్యాల తీరు… కేసు విచారణ… దర్యాప్తు…ఎలా ముగియనుందో… చూడాల్సిందే… వివరాల్లోకి వెళితే…

న్యాయవాద దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న పెద్దపల్లి ZP చైర్మన్,TRS మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు పిలవలేదు. తాను హైకమాండ్ ను కలిసేందుకు ప్రయత్నం చేయలేదని,కేసీఆర్ ను కలవడానికి ప్రయత్నిస్తే ఆయన తిరస్కరించారంటూ జరుగుతున్న వార్తలను కూడా ZP చైర్మన్ ఖండించారు.ఇదిలావుండగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ లతో, మరికొందరితో ‘పుట్ట’ మంతనాలు జరిపారు. మంతనాలు ఇంకా కొనసాగిస్తున్నట్టు సమాచారం ఉన్నది.న్యాయవాద దంపతుల హత్య కేసులో తాను ‘నిర్దోషి’ అని పుట్ట వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తనను అప్రతిష్ట పాలు జేస్తున్నారన్నది మధు ఆవేదన.అధికారపార్టీ మధు వ్యవహారంలో మౌనంగా ఉంటున్నది.హత్యకు గురైన ది ఇద్దరు న్యాయవాదులు కావడం, రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు జరుగుతుండటతో వ్యూహాత్మక మౌనాన్ని KCR, KTR ఆశ్రయించారు. TRS కు చెందిన ZP చైర్మన్ ‘జంట హత్య’కేసులో అభియోగాలు వస్తున్నప్పుడు కనీసం ఆయనను పిలిచి వివరణ కోరకపోవడం విశేషం.దారులన్నీ మూసివేస్తే పుట్ట ఏమి అనుకోవాలి.ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవాలి?
పైగా ఈ కేసులో నిందితులకు వాహనాలు, కత్తులు సరఫరా చేసి ఏమీ ఎరుగనట్టు ‘మేనమామ’ఇంట్లోనే బిట్టు శ్రీను ప్రశాంతంగా ఉన్నాడు.బిట్టు శ్రీనును పోలీసులు పుట్ట మధు ఇంటి నుంచే అరెస్ట్ చేశారు. అయినా న్యాయవాద దంపతుల హత్యలతో పుట్ట మధు ప్రమేయం లేదని అనుకుందాం.కానీ మేన మామకు చెప్పకుండా, ఆయనకు సమాచారం లేకుండా బిట్టు ఇంత క్రూర మైన హత్యలకు సహకరించి ఉంటాడని న్యాయవాదులే కాదు,సామాన్య ప్రజలు కూడా నమ్మడం లేదు. తన ‘నిర్దోషిత్వం’ రుజువు చేసుకునే బాధ్యత ‘పుట్ట’ పైనే ఉన్నది.ఇక కుంటా శ్రీనివాస్, వామన్రావు ల మద్య వ్యక్తిగత కక్షలతోనే హత్యలు జరిగాయని అనుకుందాం. కానీ న్యాయవాద దంపతుల హత్యానంతరం వెలుగు చూసిన పలు వీడియోలు,ఆడియో క్లిప్పింగ్స్ సంగతి ఏమిటి? 2018 ఎన్నికలకు ముందు ”ఒక కాంగ్రెస్ నాయకుడి’ని చంపడానికి కుంటా శ్రీనివాస్ తో ‘సుపారీ’మాట్లాడింది ఎవరు? 50 లక్షలకు ఒప్పందం కుదిరి,అడ్వాన్స్ గా 10 లక్షలు ఇచ్చే” మాటలు ఒక ఆడియోలో ఉన్నవి. 10 లక్షలు ‘వదిన’నుంచి ఇప్పిస్తానని ‘గుర్తు తెలియని వ్యక్తి’కుంటాకు హామీ ఇచ్చాడు. ఇంతకూ ‘వదిన’ ఎవరు? కుంటా శ్రీనివాస్ ‘వదిన’పేరు వెల్లడించాడా? కుంటా శ్రీనివాస్ తన ఇంటరాగేషన్ లో ఈవిషయం ఏమైనా బయటపెట్టాడా? ఆ కాంగ్రెస్ నాయకుడు ఎవరు? PLAN అనుకున్నట్టు అమలు కాలేదా?లేక PLAN ఉపసంహరించుకున్నారా?ఈ వ్యవహారం పుట్ట మధుకు తెలుసా?తెలియదా?కుంటా శ్రీనివాస్ తో ‘సుపారీ’మాట్లాడిన వ్యక్తి ఎవరు? అతన్ని గుర్తించారా? ఆడియో, వీడియోల గురించి మాట్లాడుతూ ఇందులో’కొన్ని మార్ఫింగ్’ చేసినవిగా రామగుండం కమిషనర్ సత్యనారాయణ ప్రకటించడం ఇంకో మలుపు. మొత్తమ్మీద పుట్ట మధు పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడింది. అసలే హైకోర్టు సుమోటో గా స్వీకరించింది… పూర్తిస్థాయి విచారణ మీదట పోలీసులు ఎలా నిగ్గు తేల్చుతారో వేచి చూడాల్సిందే…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *