త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లనున్న బన్నీ

‘నా పేరు సూర్య’ తరువాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నాడు. తనని మెప్పించే కథ లభించకపోవడమే అందుకు కారణం. విక్రమ్ కుమార్ ఒక కథ చెప్పినప్పటికీ, సెకండాఫ్ విషయంలో అల్లు అర్జున్ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకి ‘జులాయి’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో మరో సినిమా చేయడానికి బన్నీ తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు.

ఆల్రెడీ ఆయనకి త్రివిక్రమ్ ఒక కథ వినిపించాడనీ .. అది ఒక హిందీ సినిమాకి రీమేక్ అనే వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం బన్నీకి కొత్తగా ఒక లైన్ వినిపించి ఓకే అనిపించేసుకున్నాడట. ప్రస్తుతం పూర్తి కథను సిద్ధం చేసే పనిలో వున్నాడని అంటున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Tags: bunny , tivikram srinivas, allu arjun, aravindha sametha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *