తెలంగాణ స్వాప్నికుడు… కేసీఆర్

బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు

నిరాడంబరంగా రాష్ట్రావతరణ  వేడుకలు

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముందు చూపుతో రాష్ట్రాన్ని మునుముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేయూతనివ్వడం అందరి బాధ్యత అని తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు . ప్రజలంతా ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యూలైనప్పుడే మనం కలలుకంటున్న బంగారు తెలంగాణ సుసాధ్యం అవుతుందని చెప్పారు .
బుధవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపించారు . అనంతరం పోలీస్ ల గౌరవ వందనాన్ని స్వీకరించారు . ఈ సందర్బంగా 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు,అనధికారులు, పాత్రికేయులు, స్వాతంత్ర్య సమరయోధులకు, ఉద్యమకారులకు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు . స్వాతంత్రోద్యమానికి ముందు నుంచే పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ. మహాకవి దాశరధి కీర్తించినట్లుగా “నా తెలంగాణ కోటి రతనాలవీణ”. ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరులు, మరెంతో చారిత్రక సంపద మన వారసత్వం. స్వపరిపాలన, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి పదవులను త్యాగం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని సుదీర్ఘముగా నడిపించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కే దక్కుతుందని అన్నారు . వేలాది మంది బిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం అయినందున వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు . అమరుల త్యాగం వెలకట్టలేనిదని , అమరులైన తెలంగాణ బిడ్డలకు ఈ సంధర్బంగా జోహార్లు అర్పించారు . తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముందు చూపుతో రాష్ట్రాన్ని మునుముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేయూతనివ్వడం అందరి బాధ్యతఅని , ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజలంతా భాగస్వామ్యూలు కావాలన్నారు . అప్పుడే మనం కలలుకంటున్న బంగారు తెలంగాణ సుసాధ్యం చేసుకోగలమని తెలియజేశారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కృష్ణా, గోదావరి జలాలను సమర్ధవంతంగా వినియోగించుకొని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతుందని , కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని రూపు రేఖలు మారిపోతున్నాయన్నారు .ప్రపంచంలో అత్యంత వేగంగా నిర్మాణం అయిన ప్రాజెక్టుగా మన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర సృస్టించిందని , రాష్ట్రంలో 85 శాతం భూభాగానికి కావల్సిన సాగునీరు, త్రాగు నీరుతో పాటు పారిశ్రామిక అవసరాలు తీర్చగలిగే ప్రధాన నీటి వనరుగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు .ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీడు భూములను సైతం సస్య శ్యామలం చేయడానికి కాళేశ్వరం జలాలతో పాటు నల్లగొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకం, ఎస్.ఎల్.బి.సి. సొరంగం పనులు ,బ్రాహ్మణవెళ్ళేంలప్రాజెక్టుల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని , సాగునీరు అందించడంతో పాటు వ్యవసాయ సంక్షోబాన్ని పరిష్కరించడానికి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయన్నారు . రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత రైతులకు రుణమాఫీ కార్యక్రమం, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని , పంటకాలంలో రైతులు ఎవరి వద్ద చేతులు చాచకుండా పెట్టుబడి సాయం అందించే రైతు బంధు పథకం, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న రైతు భీమా పథకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయన్నారు . యాసంగి పంట కాలంలో రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరపై ప్రభుత్వమే కొనుగోలుచేయడం దేశంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకంఅని , కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరపై కొనడానికి నిరాకరించినప్పటికి తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా అత్యధికంగా 7.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ చేసి రాష్ట్రంలోనేకాక దేశంలోనే నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచినందుకు జిల్లా రైతాంగానికి, జిల్లా యంత్రాంగానికి శుభాభివందనలు తెలిపారు . 2021-22 సంవత్సరం వానాకాలం లో 7.20 లక్షల ఎకరాల్లో ప్రత్తి , సన్న బియ్యం రకాలను సాగు చేయుటకు వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పారు .
భవిష్యత్ లో విద్యుత్ కొరత రాకూడదనే ముందుచూపుతో నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో “యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు” నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అతి త్వరలోనే ఈ మెగా పవర్ ప్రాజెక్టు ద్వారా 4000 మెగావాట్ ల విద్యుత్ ని ఉత్పత్తి చేయబోతున్నామన్నారు . ఇంతటి బృహత్తర పథకాన్ని నల్లగొండ జిల్లా నుండే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వెలుగులు విరజిమ్ము పథకాన్ని రోపొందించిన ముఖ్యమంత్రి కె .సి .ఆర్ . కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సరఫరా చేయడం జరుగుతుందని , రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. రైతుబంధు సమితులు ఏర్పాటు చేసి రైతులు తాము పండించిన పంటకు సరియైన గిట్టుబాటు ధరకువిక్రయించేవిదంగాతోడ్పాటునందిస్తున్నామని చెప్పారు . రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలను అనుసరించి జిల్లాలో 140 వ్యవసాయ క్లస్టర్లకు రైతు వేదికల నిర్మాణం కొరకు స్థలాలను గుర్తించడం జరిగిందని . పనులు జరుగుచున్నాయని తెలిపారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందునే జిల్లాలో రెండు జాతీయ రహదారులు మంజూరు కావడం జరిగినదని , జాతీయ రహదారి 167 – కోదాడ నుండి జడ్చర్ల వరకు 267 కిలోమీటర్ల వయా హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ , కల్వకుర్తి నియోజకవర్గాల మీదుగా ,అలాగే మరొక జాతీయ రహదారి 565 – మహారాష్ట్రలోని నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించి నాగార్జునసాగర్ మీదుగా చితూర్ జిల్లా వరకు రహదారుల నిర్మాణము చురుకుగా జరుగుచున్నదని ,అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి జరిగిన కృష్ణా పుష్కరాల సంధర్భంగా జిల్లాలోని సింగిల్ లైన్ రహదారులన్నీ డబుల్ లైన్ రహదారులుగా మార్చడం జరిగిందన్నారు . తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి.ఎస్.ఐ.పాస్. ద్వారా త్వరితగతిన అనుమతులు ఇచ్చి నూతన పరిశ్రమలను ఏర్పాటు చేసుకోగలిగామని , ఈ పాలసీ ద్వారా ఎంతో మంది యువకులు నూతన పారిశ్రామికవేత్తలుగా ఎదగడం జరిగిందని , ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగిందని అని గర్వంగా తెలియజేస్తున్నామన్నారు .తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐ.టి. శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వములో తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని , రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల గ్రామం , పరిసర ప్రాంతాలు ఫార్మాసిటీగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు . దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి సీఏం కేసీఆర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని , అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకి ఆసరా ఫించన్ల ద్వారా ఆదుకుంటున్నటువంటి గొప్ప మహానుభావుడు కేసిఆర్ గారేనని అన్నారు .తెలంగాణలోని ప్రతి పల్లె, పట్టణానికి పరిశుభ్రమైన త్రాగునీరు అందించటానికి రూపొందించిన బృహత్తరమైన కార్యక్రమమే మిషన్ భగీరథ పథకం. మారుమూల ప్రాంతాలకి సైతం మంచి నీటిని అందించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు .దేశాన్ని గడగడలాడిస్తున్న సెకండ్ వేవ్ కరోనా వైరస్ నియంత్రణకు వైద్యులు, మెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది , రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్దితో పని చేస్తున్నందునకు వారిని అభినందించారు . కరోనా వైరస్ నివారణ కు వ్యాక్సిన్అందుబాటులోవచ్చినందున 18 సంవత్సరాలు , అపైన వయస్సు వారందరికి వ్యాక్సిన్ వేయుటకు ఏర్పాట్లు చేస్తున్నారని , ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్క్ లను ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, తదితర జాగ్రత్తలను పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని విజ్ణప్తి చేశారు . దేశం లోనే శాంతిభద్రతలను కాపాడటంలో తెలంగాణ పోలీసులు అగ్రభాగాన నిలిచారని చెప్పారు .ముఖ్యమంత్రి కృషితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్య , వైద్య రంగంలో గణనీయమైన ప్రగతి సాధించామని , కే.జి. టు పి.జి. ఉచిత విద్యలో భాగంగా బడుగు బలహీన , మైనారిటీ వర్గాలకు చెందిన విధ్యార్ధినీ విధ్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు , కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని , నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటు , యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ సాధించుకోవడం జరిగిందని తెలిపారు . ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధికి నోచుకుంటున్నాయని , పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంను ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు . తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వతొ ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి , గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు , జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,డి.ఐ.జి. , ఇంచార్జీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏ.వి.రంగనాథ్ , జిల్లా స్థాయి అధికారులు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరునా శుభాభివందనాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి ఐ జి ఏ వి రంగనాథ్,అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్,రాహూల్ శర్మ, , మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,జడ్పి వైస్ ఛైర్మన్ పెద్దులు, పెద్దవూర జడ్పిటిసీ కృష్ణ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు,జిల్లా ప్రభుత్వ అధికారులు,స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *