తెలంగాణ సహా నాలుగు రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌

ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల న‌గారా మోగింది. తెలంగాణ సహా ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. డిసెంబర్ 15 నాటికి ఈ ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ రాష్ర్టాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఐదు రాష్ర్టాలకు డిసెంబర్ 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ వెల్లడించారు. ఇవాళ్టి నుంచే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు.

డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు
తెలంగాణ, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7న, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల శాసనసభ స్థానాలకు నవంబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని 90 శాసనసభ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 12న తొలి విడతలో భాగంగా 18 స్థానాలకు, నవంబర్ 20న రెండో విడతలో భాగంగా 72 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల పోలింగ్ అనంతరం డిసెంబర్ 11న ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్
తెలంగాణ, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 12 నోటిఫికేషన విడుదల కానుంది. నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 19. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల షెడ్యూల్
ఛత్తీస్‌గఢ్‌లోని 90 శాసనసభ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 12న తొలి విడతలో భాగంగా 18 స్థానాలకు, నవంబర్ 20న రెండో విడతలో భాగంగా 72 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 16న విడుదల కానుంది.

మధ్యప్రదేశ్, మిజోరం షెడ్యూల్
మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 28న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 2న విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 9, ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 14.

Tags: Election Commission , Assembly Poll , CEC , OP Rawat , Madhya Pradesh , Rajasthan ,Chhattisgarh , Mizoram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *