కేసిఆర్ మౌనాన్ని… తక్కువ అంచనా వేయొద్దు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : సుదీర్ఘ అనుభవం… సమగ్ర రాజకీయ నేర్పరి తనం కేసీఆర్ సొంతం. తలపండిన రాజకీయ ఉద్దండులతో వ్యూహాత్మకంగా … అపర చాణక్యతతో తెలంగాణను సాధించిన యోధుడు. అతని మౌనాన్ని బీజేపి నాయకులు తక్కువ అంచనా వేస్తూ నోటికొచ్చినట్లుగా దుందుకుడు వ్యాఖ్యలు చేస్తుండ్రు. అది తగదు.తగినసమయంలో తగు రీతిలో గుణపాఠo తప్పదని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు.

తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిషోర్ కుమార్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ రాకేష్ కుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్  మాట్లాడుతూ…ఏప్రిల్ 27 వస్తే టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు అవుతుంది. కేసీఆర్ కి 1995 లో నలభై యేండ్ల వయసు.. అది రాజకీయంగా టేక్ ఆఫ్ అయ్యే వయసు. చంద్రబాబు ఒక వైవు ,చరిత్ర ఉన్న కాంగ్రెస్ మరో వైపు, తెలంగాణ కోసం విఫలమైన పోరాటాలు ఇంకో దిక్కు. తెలంగాణ అంశమే తెరమరుగైన పరిస్థితులు అప్పుడు. కేసీఆర్ అప్పుడు చంద్రశేఖర్ రావు మాత్రమే. ఒక మెదక్ జిల్లాకు మాత్రమే తెలుసు. మీడియా, మనీ, మజిల్ పవర్ కేసీఆర్ కు అపుడేమి లేవు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో కేసీఆర్ ఒక్కడిగా ఇరవై యేండ్ల క్రితం టీఆర్ఎస్ స్థాపించారు. ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తన పదవులను గడ్డిపోచలా త్యాగం చేసి.. లక్ష్యం నుంచి తప్పుకుంటే రాళ్ళ తో కొట్టి చంపండి అని అన్న దమ్మున్న నేత కేసీఆర్. తెలంగాణను గేళి చేసిన పరిస్థితుల్లో కేసీఆర్ ఒక్కడిగా ప్రయాణం ప్రారంభించారు. నిరాశ కల్పించినా కేసీఆర్ కుంగిపోకుండా తెలంగాణ సాధించారు. అలాంటి కేసీఆర్ గారిని గౌరవం లేకుండా కొందరు మాటాడుతున్నారు. సీఎంలను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ ది.. మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు. గోడకు వేలాడ దీసే తుపాకీ మౌనం గా ఉంటుంది ..టైం వచ్చినపుడు తుపాకీ విలువ తెలుస్తుంది. విద్యార్థులు ఉస్మానియా ,కాకతీయ యూనివర్సిటీ ల్లో చదువుకుంటే బీజేపీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీ లో అబద్దాలు నేర్చుకుంటున్నారు.. వ్యాప్తి చేస్తున్నారు. కేసీఆర్ మౌనాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయొద్దు.. అవసరం వచ్చినపుడు బఫూన్ల భరతం పడతాం. విద్యా ,ఉద్యోగ అవకాశాలు తెలంగాణ వచ్చిన తర్వాత భారీ గా పెంచిన ఘనత కేసీఆర్ గారిదే. గురుకుల పాఠశాలలు ,కాలేజీలను తెలంగాణలో వంద శాతం పెంచుకున్నాం ఇవన్నీ తెలియకుండా కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఇవన్నీ చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ విద్యాపరంగా చేసింది గుండు సున్న. కొత్త ఐఐఎం, ఐఐటి, ట్రిపుల్ ఐటీ సంస్థలను దేశమంతా ప్రకటించిన బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గుండుసున్నా. నవోదయ విద్యాలయాలు కూడా తెలంగాణ కు దక్కలేదు. కొత్త మెడికల్ కాలేజీల్లో తెలంగాణ కు దక్కింది మొండిచేయి. ఇన్ని మొండి చేతులు చూపిన బీజేపీ కి తెలంగాణ లో ఎందుకు ఓటేయాలి ?

విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ మూసేస్తుంటే ఇక బయ్యారం లో బీజేపీ ఉక్కు ఫ్యాక్టరీ కడుతుందా ? ఇలాంటి వాటి గురించి మాట్లాడకుండా బీజేపీ మాటకు ఇండియా పాకిస్థాన్ అంటుంది. ఏమైనా అంటే దేశం కోసం ధర్మం కోసం అంటారు. బీజేపీ నేతలకు తెలంగాణ దేశంలో భాగంగా ఉందని కనిపించడం లేదా ? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు ద్వారా యువత సమాధానం చెప్పాలి. అడ్వకేట్ లు , జర్నలిస్టులకు సంక్షేమ నిధి కేటాయించాము. మేము గణాంకాలతో అభివృద్ధి గురించి చెబితే బీజేపీ మాటలు మాత్రమే చెబుతోంది. మేము ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడితే మోడీ పకోడీ ల గురించి మాట్లాడుతారు. పకోడీలు అమ్ముకుంటే కూడా అది కూడా తన ఘనతే అని మోడీ చెప్పుకుంటరు. టీఆర్ఎస్ మీటింగ్ లో బఠాణీలు అమ్ముకునే వారుంటారు.. అది మా ఘనతగా చెప్పుకోవాలా ? మోడీ మాటలు కొట్లల్లో ఉంటాయి.. చేతలు పకోడీల్లా ఉంటాయి (బాత్ కరోడోమే – కామ్ పకోడీమే). మోడీ 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజి అన్నారు.. ఒక్కరికైనా ఏమైనా వచ్చిందా ? దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తాం… ఒకడు ఎగిరెగిరి ఏమై పోయాడో తెలుసు. అందరీ చిట్టాలు మా దగ్గర ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలి. మనం చేసినవి చెప్పి ఓట్లడగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *