అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ బంద్ సంపూర్ణమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని ఓ ప్రకటనను విడుదల చేసింది. బంద్‌కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. అక్రమ అరెస్ట్‌లను నేతలు ఖండించారు. భౌతికదాడులు చేయడం సరికాదని హితవు పలికారు. నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణను సాయంత్రం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు వెల్లడించాయి.
