తెలంగాణ ప్రజల ఆశ… శ్వాస… గులాబీ

తెలంగాణ ప్రజల ఆశ…శ్వాస.. గులాబీ
సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పయనించడం పూర్వ జన్మ సుకృతం

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా సందర్భంగా జెండాను ఆవిష్కరించిన తిరునగర్ భార్గవ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశ…శ్వాస..గుండె చప్పుడు టీఆర్ఎస్ పార్టీ అని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తెలిపారు. 2001,ఏప్రిల్27న పిడికెడు మందితో ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా అవతరించిందని అన్నారు. హైదరాబాద్ లోని జలదృశ్యం నుంచి కాళేశ్వరం సుజల దృశ్య ప్రాజెక్టుతో తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణిగా మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ వసంతం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరునగర్ భార్గవ్ జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీక టీఆర్ఎస్ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. గాంధేయ మార్గంలో కేసీఆర్ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా అవతరించిందన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ చెరగని ముద్ర వేసిందన్నారు.ఆధునిక రాజకీయాలకు మేలి మలుపుగా మారిందని చెప్పారు. ఎన్నో డక్కాముక్కీలను తట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన కార్యసాధకుడు కేసీఆర్ అని అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు కారణంగా విద్యుత్ సమస్యలను అధిగమించమని అన్నారు. దేశానికే బువ్వ పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. కేవలం మూడేండ్లలో కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్ దార్శనికత యావత్ ప్రపంచానికే దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం కొనసాగుతున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా, రైతు బంధు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టి రూ.1,00,116 మేనమామ కట్నంగా అందజేస్తున్నదని అన్నారు. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు రూ.2,016, వికలాంగులకు రూ.3,016 పెన్షన్ అందజేసి ఆసరాగా నిలుస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతిచెందినట్టయితే బాధిత కుటుంబంలోని నామినీకి టీఆర్ఎస్ పార్టీ రూ.2లక్షలు అందజేసి ఆదుకుంటున్నదని అన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని అన్నారు. కోవిడ్ లాంటి సంక్షోభకర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను కొనసాగించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ ప్రతీ కుటుంబానికి రూ.500 చొప్పున మూడు నెలల పాటు రూ.1500 నగదు బదిలీతో పాటు కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి నెలకు 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నారని అన్నారు. ప్రపంచ దేశాలకు హైదరాబాద్ నగరంలోని ఫార్మా కంపెనీల నుంచే మూడు వంతుల కరోనా నివారణ వ్యాక్సిన్ సరఫరా అవుతున్నదని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని వ్యాక్సిన్ సిటీగా మార్చడంలో కేసీఆర్ కృషి ఎనలేనిదని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపేందుకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అవిశ్రాంత కృషి చేస్తున్నారని తిరునగర్ భార్గవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాగార్జున చారి, నవాబ్,సలీం,అయోధ్య, బాసాని గిరి,భీంలా నాయక్, ఉదయ్ భాస్కర్, గోవింద్ రెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి, షోయబ్, ఫహీమ, రామకృష్ణ, దుర్గా రావు, ఖాజా, సైదిరెడ్డి, నాగభూషణం, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *