తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 10 రోజుల పాటు నడిచిన అసెంబ్లీ సమావేశాల్లో 3 బిల్లులు, ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అయితే ఈ 10 రోజుల సమావేశాలు వాడీవేడీగా సాగాయి. ప్రతిపక్షాల విమర్శలకు అధికార పక్షం ధీటైన కౌంటర్ ఇస్తూ వచ్చింది. సమావేశాలు చివరి రోజున కాంగ్రెస్ పార్టీ, బీజేపీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీల పాలనా తీరును ఎత్తిచూపుతూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *