తూచ్… షాకిచ్చిన బిగ్‌బాస్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌: రియాలిటీ షో బిగ్‌బాస్‌లో ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల‌కు షాక్ త‌గిలింది. నిజానికి హిమ‌జ‌, మ‌హేశ్‌, రాహుల్‌ల‌లో ఇద్ద‌రు ఎలిమినేట్ అవుతార‌ని ప్ర‌క‌టించారు. శ‌నివారం ఒక‌రు ఎలిమినేట్ చేస్తామ‌ని చెప్పిన బిగ్‌బాస్‌.. ముందుగా రాహుల్‌ను ఎలిమినేట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. హౌస్‌మేట్స్‌లో చాలా మంది హిమ‌జ ఎలిమినేట్ అవుతుంద‌ని అనుకున్నారు. అయితే బిగ్‌బాస్ అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ రాహుల్‌ని ఎలిమినేట్ చేశాడు. రాహుల్ త‌న కార‌ణంగా ఎలిమినేట్ అయినందుకు పున‌ర్న‌వి ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకుంది కూడా. హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన రాహుల్ ఇత‌ర హౌస్‌మేట్స్‌కు సంబంధించి నిజాయ‌తీ, టాస్క్ ఫెర్ఫామ‌ర్స్, ఫ్రెండ్లీనెస్‌ల‌కు సంబంధించిన మార్కులు కూడా ఇచ్చాడు. అంతా ఓకే..ఇక రాహుల్ వెళ్లిపోతున్నాడని అనుకున్న త‌రుణంలో రాహుల్‌ది ఫేక్ ఎలిమినేషన్ అని బిగ్‌బాస్ ప్రకటించాడు. లోప‌ల‌కి వెళ్లేట‌ప్పుడు రాహుల్ బిగ్‌బాస్ సూచ‌న‌లు మేర హౌస్‌లోకి ఎంట్రీ కావాల్సి ఉంటుంద‌ని రాహుల్‌కి నాగ్ తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *