తక్షణమే విధుల్లో చేరాలి : సీఎం కేసీఆర్

జూడాలకు వేతన భరోసా

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవవేతనాన్ని 15 శాతం పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మూడేండ్ల వైద్య విద్య అభ్యసించి కొవిడ్‌ సేవలు కొనసాగిస్తున్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సూచించారు. కరోనా సేవలందిస్తున్న జూనియర్‌ డాక్టర్లు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్‌లో ఇప్పటికే ఇస్తున్న వైద్యసేవలను మరింత మెరుగ్గా అందించాలని పేర్కొన్నారు. నిబంధనల మేరకు ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో వైద్యారోగ్యశాఖ అధికారులతో కరోనా పరిస్థితి, వాక్సినేషన్‌ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్ల విషయాన్ని వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ‘జూనియర్‌ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయినపుడు, పరిషరించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిషరించుకోవచ్చు. అంతేకానీ, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా.. సమయం సందర్భాలను కూడా చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిషరించడం సరైన పద్ధతి కాదు. అదికూడా, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్‌ డాక్టర్లకు సూచించారు. జూనియర్‌ డాక్టర్లపై ప్రభుత్వం ఎప్పుడూ వివక్ష చూపలేదని.. వారి న్యాయమైన సమస్యలను పరిషరిస్తూనే ఉన్నదని, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.

పలు రాష్ట్రాల్లో జూనియర్‌ డాక్టర్లకు తెలంగాణ కంటే తకువగా ైస్టెపెండ్‌ ఇస్తున్న విషయాన్ని వైద్యాధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్ల సమస్యలు ఏమిటనే దానిపై ఆరాతీసిన కేసీఆర్‌.. వాటిని వెంటనే పరిషరించాలని అధికారులను ఆదేశించారు. సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవవేతనాన్ని 15 శాతం పెంచాలని నిర్ణయించారు. మూడేండ్ల వైద్య విద్య అభ్యసించి కొవిడ్‌ సేవలు కొనసాగిస్తున్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సూచించారు.

కరోనా సేవలందిస్తున్న జూనియర్‌ డాక్టర్లు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్‌లో ఇప్పటికే ఇస్తున్న వైద్యసేవలను మరింత మెరుగ్గా అందించాలని పేర్కొన్నారు. నిబంధనల మేరకు ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం కార్యదర్శి, సీఎంవో కొవిడ్‌ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, హెల్త్‌ సెక్రటరీ ఎస్‌ఎఎం రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు, సీఎం వోఎస్డీ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *