ఢిల్లీ మహిళలకు…ఉచిత బస్సు ప్రయాణం : కేజ్రీవాల్

అక్షిత ప్రతినిధి, న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళలకు సిఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త వినిపించారు. గురువారం జరిగిన ఢిల్లీ కేబినెట్ భేటీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి కైలాష్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీ నుంచి మహిళలు ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చాని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు రూ.140 కోట్ల నిధులు కేటాయించాలని ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి కైలాష్ వెల్లడించారు. డిటిసితో పాటు క్లస్టర్ బస్సుల్లోను ఉచితంగా ప్రయాణించావచ్చాన్ని, అందుకు సంబంధించిన పాసులు బస్సు కండక్టర్ దగ్గర లభిస్తాయని, ఉచితంగా ప్రయాణించడం ఇష్టం లేకపోతే టికెట్ తీసుకోవచ్చని మంత్రి సూచించారు.

 

 

 

 

tags : delhi cm, kejriwal, cabinet, delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *