టీబీ రహితంగా… ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్

 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలో టీబీ వ్యాధి నివారణకు తెలంగాణ వైద్యారోగ్య తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా నాలుగు జిల్లాలు టీబీ రహిత జిల్లాల హోదా వైపుగా అడుగులు వేస్తున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు టీబీ నివారణ లక్ష్యానికి చేరువవుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఒక జిల్లా లేదా ఒక రాష్ట్రం టీబీ రహితమని ప్రకటించాలంటే కేసుల్లో 80 శాతం తగ్గుదల ఉండేలా చూడాలి.

భద్రాచలం జిల్లాలో గత ఐదేండ్లుగా కేసుల్లో గణనీయమైన తగ్గుదల నమోదవుతూ లక్ష్యానికి అతి చేరువైనట్టు కేంద్రం తెలిపింది. మిగిలిన మూడు జిలాల్లో అనుకూల ఫలితాలు ఉన్నట్టు పేర్కొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 18, 19 తేదీల్లో కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల కమిటీ ఈ నాలుగు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఈ సందర్భంగా టీబీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ రాజేశం మాట్లాడుతూ.. ఈ నాలుగు జిల్లాలు త్వరలో టీబీ ఫ్రీ హోదాను సాధిస్తాయనే నమ్మకం ఉన్నదని, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది సహకారంతో టీబీ పేషెంట్లను గుర్తించడం, సరైన చికిత్స అందించడం వంటివి చేస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *