టీఆర్‌ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే!

సీఏఏ, ఎన్నార్సీపై కేసీఆర్‌ మాట్లాడరేం?.. 

టీఆర్‌ఎస్ కు మజ్లిస్‌ ఎలా మద్దతిస్తుంది?

మైనారిటీలకు అసద్‌ సంజాయిషీ ఇవ్వాలి

మునిసిపోల్స్‌ షెడ్యూల్‌లో టీఆర్‌ఎస్‌ కుట్ర

కాంగ్రెస్ ను గెలిపిస్తే అవినీతిరహిత పాలన

ఫేస్‌బుక్‌ లైవ్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌: మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘‘అనేక సందర్భాల్లో బీజేపీతో టీఆర్‌ఎస్‌ కుమ్మక్కైంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జీఎస్టీ, ట్రిపుల్‌ తలా క్‌ బిల్లుల విషయంలోనూ బీజేపీకి మద్దతు ఇచ్చింది. సీఏఏ, ఎన్నార్సీలను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమంటూ పశ్చిమబెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల సీఎంలు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేద్దామంటూ మా పార్టీ ప్రతిపాదించినా కేసీఆర్‌ మాట్లాడడం లేదు. ఈ విషయమై మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఆయన్ను ఎందుకు అడగట్లేదు?’’అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మైనారిటీలు ఈ అంశాలను గమనించాలని విజ్ఞప్తి చేశా రు.

గాంధీభవన్‌నుంచి శుక్రవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉత్తమ్‌ మాట్లాడారు. బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎ్‌సకు ఏవిధంగా మద్దతు ఇస్తున్నారో మైనారిటీలకు అసదుద్దీన్‌ సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సెక్యులర్‌ సమాజాన్నే కోరుకుంటుందన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన చోట అవినీతి రహిత పాలన అందించడంతోపాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మునిసిపల్‌ ఎన్నికల షె డ్యూల్‌ జారీలో టీఆర్‌ఎస్‌ కుట్ర పూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఓటరు జాబితా, రిజర్వేషన్ల ఖరారు కాకముం దే.. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిందని మండిపడ్డారు. ఈ కుతంత్రాలను ఛేదించి కాంగ్రెస్‌ కార్యకర్తలు మంచి ఫలితాలు సాధిస్తారన్న నమ్మకం తనకుందన్నారు.

స్ర్కూట్నీ నుంచి ఉపసంహరణ వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. డబ్బు ప్రభావం, అధికార దుర్వినియోగంతో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘నిరుద్యోగులకు నెలకు రూ.3016 చొప్పున భృతి ఇస్తామన్న హామీని కేసీఆర్‌ విస్మరించారు. రైతులకు రుణమాఫీ చేయలేదు. మునిసిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌, టీఆర్‌ఎ్‌సకు షాక్‌ ఇస్తే కానీ.. ఇవి అమలు కావు’’ అని అన్నారు. హామీలు అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారంటూ టీఆర్‌ఎ్‌సను నిలదీయాలని సూచించారు. అనంతరం 120 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోని కార్యకర్తలు, నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఉత్తమ్‌ మాట్లాడారు.

కాంగ్రె్‌సలో బీ ఫారాల సందడి

మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫారాల జారీ ప్రారంభమైంది. సంగారెడ్డి మునిసిపాలిటీకి సంబంధించి బీఫారాలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఖుంటియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అందజేశారు. శనివారం నుంచీ బీ ఫారాల జారీ మరింత వేగవంతం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మా అభ్యర్థులపై టీఆర్‌ఎస్‌ వల: గూడూరు

మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు చెందిన బలమైన అభ్యర్థులను ఆకర్షిచి.. వారిని పోటీ నుంచి తప్పించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆరోపించారు. కాంగ్రె్‌సను బలహీన పరిచేందుకు కేసీఆర్‌ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ కుట్రలను ఛేదించి అధిక స్థానాలను గెలిచే సత్తా కాంగ్రెస్‌ శ్రేణులకు ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *