టీఆర్‌ఎస్‌…ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుoది : ఉత్తమ్‌

నేరేడుచర్ల,  అక్షిత ప్రతినిధి : హూజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఏ మొఖం పెట్టుకొని టీఆర్‌ఎస్‌ నాయకులు ఓట్లు అడుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నేరేడుచర్లలో సోమవారం రాత్రి ఆయన ప్రచారం నిర్వహించారు. హుజూర్‌నగర్‌లో ఒక్క రూపాయి అభివృద్ధి చేసి ఉంటే ఓట్లు అడగాలన్నారు. గిరిజనులకు 12 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రిపదవి లేని కేబినెట్‌ లేదని, 40లక్షల ఉన్న మాదిగలు మంత్రి కావడానికి అర్హత లేదా అని ప్రశ్నించారు. వారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో రహదారులు, సీసీరోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించింది కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు భాస్కర్‌రావు, విజయసింహారెడ్డి, గుత్తాకు, చందర్‌రావుకు ఈ నియోజకవర్గంలో ఇంటింటికీ వచ్చి గూడుపుటానిలు చేస్తున్నారని విమర్శించారు. వారి ప్రాంతాల్లోనే ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో వారికి ఏం పని అని నిలదీశారు. అనైతికంగా, ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతామన్నారు. పని చేసినం నిజాయితీ, నిబద్దతతతో పనిచేశా, ఓట్లడిగే హక్కు తనకే ఉందని స్పష్టంచేశారు. ‘మిషన్‌ భగీరథ అంటూ నేను చేసిన పనులు తవ్వినరు తప్ప ఒక్క నల్లా వేశారా’ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొణతం చిన వెంకటెడ్డి, నూకల సందీ్‌పరెడ్డి, శ్రీపతి చౌదరి, అన్నపరెడ్డి అప్పిరెడ్డి, మచ్చ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

 

tags : uttam, nereducherla, cong, campaign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *