అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : మఠంపల్లి మండలం పెడవీడు గ్రామం నుండి గురువారం మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు.వారిని పార్టీ కండువా ఆహ్వానించారు సైదిరెడ్డి.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీ లోకి వలసల పర్వo కొనసాగుతుందని పేర్కొన్నారు. రాబోయే ఉపఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలవడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బానోవత్ జగన్ నాయక్,సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి,ఆరోగ్యరెడ్డి,బాలకృష్ణ, కోట,రామిరెడ్డి,జాల కిరణ్ తతితరులు పాల్గొన్నారు.
tags : trs, joining in mattampally