ముమ్మరంగా గులాబీ సభ్యత్వం
శ్రీకాంత్ యాదవ్
కుతుబుల్లాపూర్, అక్షిత ప్రతినిధి :
ముమ్మరంగా గులాబీ సభ్యత్వాలు జోరందుకున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డిపోచంపల్లి
తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మహేందర్ యాదవ్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం తొమ్మిదో వార్డు పరిధిలోని సాయి బాబా కాలనీలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జరిగింది. ఈ సందర్బంగా టిఆర్ఎస్ యువ నాయకుడు అనబోయిన శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్ లతోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు గులాబీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. దుందిగల్ మున్సిపల్ పరిధిలోనే సభ్యత్వాల్లో డి పోచంపల్లిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కౌన్సిలర్ బండారి మహేందర్ యాదవ్ విశిష్ట కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు హరి ప్రసాద్ రాజు, రమణా చౌదరి, జై రామ్ , శీను మహేష్, తదితరులు పాల్గొన్నారు.
