జైట్లీ మృతి.. తెలుగు ప్రముఖుల సంతాపం

అక్షిత ప్రతినిధి, అమరావతి: భాజపా సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ (66) మృతిపట్ల పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పలువురు నేతలు అభిప్రాయడ్డారు.

దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి

– తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌

జైట్లీ మృతి షాక్‌కు గురిచేసింది. ఆయన దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

-తెలంగాణ సీఎం కేసీఆర్‌

జైట్లీ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దేశం కోసం ఎంతో సేవ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.

– ఏపీ సీఎం జగన్‌

కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా జైట్లీ సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

– తెదేపా అధినేత చంద్రబాబు

జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఆయన సేవలు చిరస్మరణీయం.

– ఎంపీ సుజనా చౌదరి

జైట్లీ ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

– తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌

జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన సేవలు చిరస్మరణీయం.

– తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

జైట్లీ మరణం దేశానికి, పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.

– భాజపా సీనియర్‌నేత దత్తాత్రేయ

జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

– హరీశ్‌రావు

అరుణ్‌ జైట్లీ మరణం బాధాకరం. న్యాయవాదిగా, కేంద్ర మంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయనలో సంస్కరణాభిలాష మెండుగా కనిపించేది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను

-జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అరుణ్ జైట్లీ మంచి వక్త, గొప్ప న్యాయ కోవిదుడు. న్యాయశాఖ, ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆయన లేనిలోటు తీర్చలేనిది.

-తెదేపా నేత ఎల్‌.రమణ

దేశం ఓ మహానాయకుడిని కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన ఎంతగానో సహకరించారు. తెలంగాణతో పాటు దేశానికి జైట్లీ చేసిన సేవలు మరవలేనివి.

– బి.వినోద్ కుమార్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *