జూన్ 2 నుంచి నిరుద్యోగ భృతి ?

లౌక్య‌న్యూస్ – నిరుద్యోగ భృతి పై రాష్ట్రం క‌సర‌త్తు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.. రాష్ట్రంలో దాదాపు పది లక్షలమందినిరుద్యోగులు ఉన్న‌ట్లు స‌మాచారం..వీరికి ఏ విధంగా భ్రుతి చెల్లించాల‌నే దానిపై ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల లో కొన‌సాగుతున్న తీరు పై అద్యాయ‌నం కూడా చెస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిరుద్యోగికి ఎంత మొత్తం భృతి ఇవ్వాలి, అసలు నిరుద్యోగి నిర్వచనం ఏమిటి, వయో పరిమితి ఏమిటి , కుటుంబాదాయం ఎంత ఉండాలి, ఎంత కాలం ఇవ్వాలి అనే విషయాలను ప్రభుత్వం ఇపుడు పరి శీలిస్తున్నది. వీటి అధ్యయనం పూర్తవగానే నిరుద్యోగ భృతి మొత్తం ఎంత ఉండాలనేదాని మీద స్పష్టత వస్తుంది. ఈ అంచనాను బట్టి వచ్చే బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు వుంటుందని వార్త‌లు వినిపిస్తున్నాయి.ఈ స్పష్టత కోసమే తెలంగాణ అవతరణ దినం నాటి నుంచి అమలయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది..
ఈ లోపు ఆంధ్రప్రదేశ్ తో సహా ఇతర రాష్ట్రాలలలో నిరుద్యోగ భృతి పథకాలను అధ్యయనం చేయడం మొలు పెట్టింది. ప్ర‌స్తుతం ఏడు రాష్ట్రాలలో నిరుద్యోగ భృతి పథకాలు అమలులో ఉన్నాయి. ఛత్తీష్ గడ్, కేరళ, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో అమ‌లు అమ‌లు లో ఉండగా ఎపిలో క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది… అయితే అన్నిచోట్ల‌ ఈ పథకం ఒకే రూపంలో లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఉదాహరణకు ఛత్తీష్ గడ్ 18-35 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగులకు రు. 1000 ల నిరుద్యోగ భృతి ఇస్తున్నది.. కాకపోతే అర్హత వయసు 22-35 సం.రాలు. ఆంధ్రలో గత అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. హర్యానాలో ఈ పథకం మరొక విధంగా ఉంది. అక్కడ చదువు,వయసును బట్టి నిరుద్యోగ భృతి మారిపోతుంది. అంతేకాదు, మహిళా గ్రాజయేట్లకు పురుషులకంటే ఎక్కువ. వయసు 21-35 సంవత్సరాలు. టెన్త్ పాసయిన యువకులు నిరుద్యోగ భృతి నెలసరి రు.100, ఇంటర్ అర్హత ఉన్నవారికి రు. 900, గ్రాజ్యుయేట్లకు రు. 1000 నుచి1500, పోస్టు గ్రాడ్యుయేట్లకు రు.3000 ఇస్తున్నారు.చిన్న రాష్ట్రమయిన హర్యానాలో ఇది సాధ్యం. అయినా సరే ఈ విధానం కూాడా పరిశీలనలో ఉంది. ’హిమాచల్ ప్రదేశ్ లో రెండు స్లాబులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఇంటర్ పాసయి, 20 సంవత్సరాలు వయసున్న వారందరికి నెలకు 1000 చొప్పున రెండేళ్ల పాటు భృతి ఉంటుంది. 50 శాతంలోపం ఉన్న పిహెచ్ సి లకు రు. 1500 భృతి ఉంది. ఇది 20-35 సంవత్సరాల మధ్య ఉన్నవారికి మాత్రమే భృతి ఇస్తారు,’ అని ప్రభత్వ వర్గాలు చెప్పాయి. తెలంగాణలో , హిమాచల్ నమూనా అనుసరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ప‌లువురు చెబుతున్నారు.అందువల్ల తెలంగాణలో నిరుద్యోగి అంటే ఎవరు, వయోపరిమితితో పాటు, కుటుంబ పెద్ద ఆదాయం వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని భృతి నిర్ణయిస్తారు. ఈ విధానం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి పూర్తి చేసి, జూన్ 2 వ తేదీ నుంచి అమలు చేసే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *