జీడిమెట్ల పేలుడు ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఆదివారం అర్ధారాత్రి జరిగిన పేలుడులో గాయపడిన ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ పరిశ్రమంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా వారి పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు ఉదయం మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన ముఖేష్‌ నారాయణ చౌదరి(35), మాధరవీందర్ సింగ్‌(35)గా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *