జర్నలిస్టుల సమస్యలను పరిష్కారించాలి

అక్షిత బ్యూరో, సూర్యాపేట: జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ

టీయుడబ్ల్యూ జే- ఐజేయు ఆధ్వర్యంలో సూర్యాపేట తహసీల్దార్ కు జర్నలిస్టులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకై తమవంతు పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చారని వాటిలో చాలా వరకు నెరవేర్చక పోవడంతో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వినతిపత్రం లో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం పిలుపు మేరకు దశలవారీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. జర్నలిస్టు నాయకులు, సంఘ నాయకులు న్యాయమైన

డిమాండ్లు:  జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్ధలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి

అందరికి హెల్త్ కార్డు లు జారిచేసి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో అవి చెల్లుబాటు అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు

G.O.No. 239రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులు అందరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.

2014 ఎన్నికల సందర్భంగా   అధికార తెరాస పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టు లకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *