జర్నలిస్టులను ఆదుకోవాలి

యాదగిరికి బియ్యం, డ్రై ఫ్రూట్ వితరణ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : రాష్ట్రంలో కోవిడ్ బారిన పడినవారికి కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్టు హామీదుద్దీన్, నాగయ్య, పేర్ల వెంకటయ్యలు కోరారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో కోవిడ్ కు గురైన జర్నలిస్టు యాదగిరికి బియ్యం, డ్రైఫ్రూట్స్ అందించిన అనంతరం వారు మాట్లాడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు నాయకులు స్వచ్ఛంద సంస్థలవారు నిరుపేదలకు కోవిడ్ బాధితులకు ఉచితంగా భోజనం, డ్రైఫ్రూట్స్ అందిస్తున్నట్టే పాత్రికేయులు ప్రముఖంగా ప్రచురించేందుకు యత్నిస్తున్నారు. కానీ పాత్రికేయులు కోవిడ్ బారినపడి ఉపాధి లేక అల్లాడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయలు, కోవిడ్ తో చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ డివిజన్లో కోవిడ్ బారిన పడ్డ విలేకరులకు తనవంతు ఆర్థిక సహాయం అందిస్తానని సీనియర్ పాత్రికేయులు బొంగరాల మట్టయ్య అన్నారు. సహాయం కోరుకునే వారు తన సెల్ ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మంద సైదులు, ఫోటో నాగేశ్వరరావు,భాస్కర్, సునీల్, రాజారాం, నాసరుద్దీన్, మధు, గణేష్, గని, వినయ్, ప్రవీణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *