జమ్ముకశ్మీర్‌ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

అక్షిత ప్రతినిధి, దిల్లీ : జమ్ముకశ్మీర్‌ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ బిల్లును ఈ రోజు ఉదయం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ జరిగింది. హోంమంత్రి వివరణ అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా.. స్వల్ప సాంకేతిక సమస్య రావడంతో స్లిప్పులతో ఓటింగ్‌ చేపట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదావేశారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది.

 

tags : kashmir, bifurcation, 370

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *