జన జాతర షురూ

అప్రమత్తంగా ఉండాలి
పెద్దగట్టు జాతర సెక్యూరిటీ పరిశీలించిన

జిల్లా యస్.పి R. భాస్కరన్ ఐపిఎస్

భక్తులు జాగ్రత్తలు పాటించాలి – యస్.పి

సూర్యాపేట, అక్షిత బ్యూరో :పెద్దగట్టు జాతర యొక్క పోలీసు బందోబస్తును సెక్యూరిటీ ఏర్పాటు జిల్లా యస్.పి భాస్కరన్ ఐపిఎస్ పరిశీలించారు. సీసీ టీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ జాతర దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన పోలీసు రక్షణ బందోబస్తును ఏర్పాటు చేసినామని అన్నారు. జాతర ప్రాంగణంలో, జాతీయ రహదారిపై, గట్టుపై మొత్తం 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినామని, జాతర మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షయణలో ఉంచాం అన్నారు. మహిళ భద్రత కోసం మహిళ పోలీసు సిబ్బందిని, షీ టీమ్స్ ను, మఫ్టీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపినారు.

*భక్తులు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా యస్.పి*

🔹జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా గడపాలని అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి అని కోరినారు. అనుమానిత వస్తువులను తాకవద్దు అన్నారు. పోలీసు వారు చూపిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి అన్నారు, అత్యవసర సమయాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపినారు. క్యూ లైన్స్ పాటించాలి, బారికేడ్స్ దాటుకి రావద్దు అన్నారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తుంచవద్దు, గొడవలు, తగాదాలు పెట్టుకోవద్దు అని అన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉత్సవాన్ని ఆనందించాలి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *