జగ్జీవన్ స్పూర్తితో బరిలో నిలిచా

ఆదరించండి… అక్కున చేర్చుకోండి
ఎం ఎస్ పీ అభ్యర్ధి ఆడెపు నాగార్జున

హలియా, అక్షిత ప్రతినిధి :
దళితుల అభ్యున్నతికై అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు, మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితోనే ఎన్నికల బరిలో నిలిచానని మహాజన సోషలిస్టు పార్టీ సాగర్ అసెంబ్లీ అభ్యర్ధి ఆడెపు నాగార్జున అన్నారు. సోమవారం హలియా పట్టణంలోని
ఎంఎస్ పీ కార్యాలయంలోబాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, అన్నీ గ్రామాల్లో పర్యటిస్తున్నానని, తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ సారథ్యంలో ఎన్నో ఉద్యమాలు సాగించారన్నారు. సామాజిక నేపధ్యం కల్గి ఉండి అన్నీ వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉద్యమాలు సాగిస్తున్నారన్నారు. మీ బిడ్డగా నన్ను ఆదిరించి అక్కున చేర్చుకొని… తమకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పీ నాయకులు తిప్పారపు లక్ష్మణ్, మంద కుమార్, పుజాలోల్ల రవి మాదిగ, పుట్ట రవి, బిక్షపతి, సౌల్, ఎర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *