జగ్జీవన్ కు… భారత రత్న ఇవ్వాలి

జగ్జీవన్ స్పూర్తితో.. ‘ మహా జన చైతన్యం

ఎంఎస్ పి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచిత పోరు సాగించిన దళిత జన భాంధవుడు, మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ కు భారత రత్న ఇవ్వాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాల కు సమీపంలో గల జగ్జీవ న్ రామ్ విగ్రహానికి మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షులు, మహాజననేత మందకృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు బాబూ జగ్జీవన్ రామ్ కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితులపట్ల కేంద్రర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షత చూపుతున్నాయన్నారు. జగ్జీవన్ రామ్ స్పూర్తి తో మహజనుల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ దేశానికి 50 ఏండ్లు నిర్విరామంగా సేవలు అందించడంతో పాటు ఈ దేశానికి దళితుడైన ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ కు ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వకపోవడం వివక్షత కాదా అని దుయ్యబట్టారు. ఈ సమాజానికి ఐదేండ్లు, ఐదునెలలు కూడ సేవచేయని వారికి భారతరత్న ఇస్తున్నారన్నారు. అనేక సామాజిక ఉధ్యమాలకు వారధిగా వ్యవహరించి, రిజర్వేషన్ల వ్యవస్థ ఏర్పాటులో క్రీయాశీలక భూమిక పోషించిన మహానీయుడు జగ్జీవన్ రావుకు ఎందుకు ఇవ్వరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస దళితులను చిన్న చూపు చూస్తుంధన్నారు. ఈ దేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికిన వారినే అవమానిస్తున్నారంటే ఇంకా కింది స్థాయి దళితబహుజనుల పరిస్థితి ఏమిటన్నారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో ఈ సమాజాన్ని చైతన్యం చేస్తూ రాజకీయంగా ఎదుగుతామన్నారు. ఆవైపుగా మహాజన సోషలిస్టు పార్టీ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా కార్యచరణ రుపొందించుకొని ముంధుకు కొనసాగుతుందన్నారు. బహుజన రాజ్యాధికారం దిశగానే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ పోటి చేస్తుందన్నారు. సాగర్ లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డబ్బులను, మధ్యాన్ని ఎరవేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. డబ్బులు, మధ్యం లేకుండా సామాజిక, రాజకీయ మార్పుకై మహాజన సోషలిస్టు పార్టీ ఓటర్ల దగ్గరకు వెలుతుందన్నారు. ఎన్నికల కమీషన్ స్వతంత్రంగా వ్యవహారించి పారదర్శకంగా ఎన్నికలు జరిగేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా సినియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ, జేఏసి జిల్లా చైర్మన్ పందుల సైదులు, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షం, మాదిగ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ మల్లేపాక వెంకన్న, మాదిగ ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు లంకపల్లి నగేష్ మాదిగ, టిఎస్ యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, రమణ భార్గవ్, యాదయ్య, తీగల యాదయ్య, మల్లికార్జున్, గోపాల్, చంద్ర శేఖర్, వెంకటేశం యాదయ్య, కందుల అంజి, బొజ్జ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *