జగ్జీవన్ ఆశయ సాధనకు కృషి

బడుగుల ఆశాజ్యోతి… బాబు జగ్జీవన్ రామ్
ఎం ఆర్ పి యస్ జాతీయ నేత లక్ష్మణ్ మాదిగ

సాగర్ తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి :
దళిత జన భాంధవుడు డా. బాబు జగ్జీవన్ రామ్ సేవలు విశిష్టమని ఎం ఆర్ పి యస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ అన్నారు. సోమవారం డా బాబు జగ్జీవన్ రామ్ 134 వ జయంతిని పురస్కరించుకొని
నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిర్మలగిరి సాగర్ మండలం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ఎంఆర్ పి యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అవిరళ కృషి చేస్తున్నారన్నారు. బడుగుల రాజ్యాధికారమే దిశగా మహాజన సోషలిస్టు పార్టీ స్థాపించడం… సాగర్ ఉప ఎన్నికల్లో ఆడెపు నాగార్జునను అభర్ధిగా బరిలో నిలిపారాన్నారు. మహజనులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం తోనే మహా జనులకు సాధికారత సాధ్యమన్నారు. తొలుత మహనీయ డా.బాబు జగ్జీవన్ రామ్ 134 వ జయంతి వేడుకలను ఎంఎస్ పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జగ్జీవన్ రామ్ వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించడానికి మహాజన నేత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో 27 సంవత్సరాలు గా అలుపెరుగని పోరాటం సాగుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జగ్జీవన్ రామ్ ఆశయాలు సాధించి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ఉప ఎన్నికల తిర్మలగిరి సాగర్ మండల ఇంఛార్జీలు యాతాకుల రాజన్న మాదిగ, నల్లచంద్ర స్వామి మాదిగ, భూషిపాక గణేష్ మాదిగ, మహాజన కళామండలి రాష్ట్ర నాయకులు మల్లెపాక అనిల్,బఛ్చలకూర స్వామి,
కేషపాక రామచందర్, ఎం ఆర్ పి యస్ జాతీయ నాయకులు ఇరిగి పైడి మాదిగ, ఎం వై యస్ రాష్ట్ర నాయకులు కృష్ణ, బద్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *