చైనాతో వాణిజ్య యుద్ధం …. ట్రంప్‌ పశ్చాత్తాపo

బియారెట్జ్‌ :  ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో దూసుకొచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు అయిన దగ్గరి నుంచి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక చైనా విషయంలో అయితే, ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఒకరి వస్తువులపై మరొకరు సుంకాలు విధించుకుంటూ అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులకు దారి తీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమన మేఘాలు కమ్ముకొంటున్న దానికీ అగ్రరాజ్యం, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కూడా ఒక కారణం. చైనా విషయంలో దూకుడుగా ఉన్న ట్రంప్‌ అనూహ్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో అల్పాహార విందు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాతో వాణిజ్య యుద్ధం విషయంలో పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు. ‘అవును. చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగినందుకు పశ్చాత్తాప పడుతున్నాను. అయితే, ప్రతిదానికి నా దగ్గర ప్రత్యామ్నాయం ఉంది’ అని పేర్కొన్నారు. జీ-7 సదస్సులో భాగంగా ఇక్కడకు వచ్చిన ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 250 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై శుక్రవారమే 25శాతం నుంచి 30శాతం సుంకాలు విధించారు. మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10 నుంచి 15శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో మరికొన్ని వస్తువులపై విధించనున్నట్లు తెలిపారు. ఒక పక్క పశ్చాత్తాప పడుతూనే చైనా ఇదే విధంగా దుందుడుగా వ్యవహరిస్తే, వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచేందుకు తాను వెనకాడబోనని హెచ్చరించారు. ‘చైనా చేసిన పని సిగ్గుమాలిన చర్య’ అని అభివర్ణించిన ట్రంప్‌  చైనాలోని అమెరికా కంపెనీలను వెనక్కి రప్పించే సామర్థ్యం తనకు ఉందున్నారు. కానీ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు బాగానే ఉండటంతో ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. ‘శాంతియుత వాణిజ్యమే మా అజెండా. జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి ఎలాంటి ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు. అయితే, మేధాసంపత్తి హక్కులను  చైనా దొంగిలించిన కారణంగానే వాణిజ్య యుద్ధం మొదలై, జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది.

 

 

 

 

 

tags :    trumpu, china, trade war

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *