చిన్న పత్రికలకు ప్రకటనలివ్వాలి

మంత్రి కేటీఆర్ కు వినతి
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి :

చిన్న పత్రికలకు ప్రకటనలిచ్చి ఆదుకోవాలని రాష్ట్ర పురపాలక, ఐటి పరిశ్రమ ల శాఖ మంత్రి కేటిఆర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు తెలిపారు. సోమవారం దేశోద్ధారక భవన్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సురవరం ప్రతాప రెడ్డి 125 వ జయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరించేందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసి చిన్న పత్రికలకు ప్రతినెల విడుదల చేసే ప్రకటనలు విడుదల చేసి, దినపత్రికలను కాపాడాలని కోరామన్నారు. అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారికి మన సమస్యలను వివరించామని, సీఎం దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు అగస్టీన్, కోశాధికారి ఆజoఖాన్, రాష్ట్ర నాయకులు, వెంకటయ్య యూసుఫ్ ఉద్దీన్, ఇక్బాల్, అఫ్రోజ్ ఖురేషి, రియాసత్, ఖాదిర్ ,ఫారూఖి, వాజీద్ మసూద్ తదితర పత్రికా సంపాదకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *