చిదంబరానికి మ‌ధ్యంత‌ర బెయిల్‌

అక్షిత ప్రతినిధిహైదరాబాద్‌ : మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రానికి ఇవాళ సుప్రీంకోర్టు మ‌ధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రాన్ని అరెస్టు చేయ‌కుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ ఆ కేసును విచారిస్తున్న విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 26వ తేదీ వ‌ర‌కు ఆ వెస‌లుబాటు క‌ల్పించారు. అయితే ఇదే కేసులో రెండు రోజుల క్రితం చిదంబ‌రాన్ని హైడ్రామా మ‌ధ్య సీబీఐ పోలీసులు చిదంబ‌రంను అరెస్టు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో చిదంబ‌రం బెయిల్‌కు సంబంధించి వాద‌న‌లు జ‌రిగాయి. సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టులో త‌న వాద‌న వినిపించారు. చిదంబ‌రానికి వ్య‌తిరేకంగా సాక్ష్యాల‌న్నీ డిజిటిల్ డాక్యుమెంట్లు, ఈమెయిళ్ల రూపంలో ఉన్న‌ట్లు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తెలిపారు. మ‌నీల్యాండ‌రింగ్ ప‌ద్ధ‌తిలో అవినీతి సొమ్ము మాయ‌మ‌యింద‌న్నారు. చిదంబ‌రానికి విదేశాల్లో 10 ప్రాప‌ర్టీలు, 17 బ్యాంకు అకౌంట్లు ఉన్న‌ట్లు తుషార్ మెహ‌తా చెప్పారు. అయితే సోమ‌వారం రోజున సీబీఐ, ఈడీ కేసుల‌ను సుప్రీం విచారించ‌నున్న‌ది. అప్ప‌టి వ‌ర‌కు చిదంబ‌రం సీబీఐ క‌స్ట‌డీలోనే ఉంటారని కోర్టు చెప్పింది. చిదంబ‌రానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లును సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కోర్టుకు స‌మ‌ర్పించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ లాయ‌ర్లు సిబ‌ల్‌, సింఘ్వీలు దాన్ని అడ్డుకున్నారు. అయితే ప్ర‌తి అంశాన్ని సోమ‌వార‌మే వింటామ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

 

 

tags : chidamberam, ex Home minister, supremecourt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *